ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం?

  • అశ్వత్థామరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం
  • ప్రభుత్వం స్పందించేంత వరకు దీక్ష విరమించేది లేదన్న అశ్వత్థామరెడ్డి
  • దీక్ష విరమించుకోవాలంటున్న వైద్యులు
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన నివాసంలోనే దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన నివాసం వద్దకు పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దీక్ష విరమించుకోవాలని వైద్యులు సూచించినా అశ్వమత్థామరెడ్డి కొనసాగిస్తున్నారు.

కాగా, అశ్వత్థామరెడ్డిని పలువురు నేతలు పరామర్శించారు. బీజేపీ నేతలు వివేక్ రెడ్డి, జితేందర్ రెడ్డి.. అశ్వత్థామరెడ్డి నివాసానికి బయల్దేరగా మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. వారు ఆందోళనకు దిగడంతో పోలీసులే స్వయంగా వారిని అశ్వత్థామరెడ్డి నివాసానికి తీసుకువచ్చారు. ఇక, అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం సానుకూలంగా స్పందించేంత వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.
Go Back to Shorts
TSRTC
Telangana
Ashwathama Reddy
JAC
TRS
BJP

More Telugu News